- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచిన్ అల్లుడితో సారా డేటింగ్? రెస్టారెంట్‌లో గుర్తించిన ఫ్యాన్స్
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్.. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ శుభ్‌మన్‌గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి.

X
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్.. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ శుభ్‌మన్‌గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు గుర్తించిన అభిమానులు.. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. విషయానికొస్తే.. ఓ టిక్‌టాకర్ షేర్ చేసిన వీడియోలో సారా, శుభ్‌మన్ ఒకే టేబుల్‌పై కూర్చొని వెయిటర్‌కు ఆర్డర్ ఇస్తున్నట్లు కనిపించారు. దీంతో వీరిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిన అభిమానులు 'అక్కడ ఏం జరుగుతోంది? శుభ్‌మన్ ఇప్పటికే సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు కదా? సారా వాళ్లిద్దరిని విడగొట్టిందా ఏంటి?' అంటూ చర్చ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Next Story






