సారా అలీఖాన్‌పై దారుణమైన ట్రోలింగ్.. వెంటనే ఆ ఫీల్డ్ నుంచి తప్పుకోమంటూ

by Disha Web Desk 10 |
సారా అలీఖాన్‌పై దారుణమైన ట్రోలింగ్.. వెంటనే ఆ ఫీల్డ్ నుంచి తప్పుకోమంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్, నటి సారా అలీఖాన్ మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె సీక్విన్ గోల్డెన్ కలర్ అద్దాల గౌనులో ర్యాంప్ వాక్ చేసి అభిమానులను అలరించింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నటి ఫ్యాన్స్ బ్యూటిఫుల్, అమేజింగ్ అంటూ పొగిడేస్తుండగా మరికొందరుమాత్రం దారుణంగా ఎగతాళి చేస్తున్నారు. సారా ర్యాంప్ వాక్ అసహ్యంగా ఉందని, వెంటనే మోడలింగ్ నుంచి తప్పుకోవాలంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు ‘సారా చాలా విచిత్రంగా నడుస్తోంది. ఆమెను చూస్తే ఫన్నీగా అనిపిస్తోంది. ఇకపై మోడలింగ్‌ నుంచి తప్పుకుంటే చాలామంచిది. లేదంటే ఆమె టాలెంట్ చూసి జనాలు భయపడతారు. ఈ డ్రెస్సింగ్‌లో ఆమె ఇబ్బందికరంగా కనిపిస్తుంది. నటి ఎందుకు కొత్తగా ప్రయత్నిస్తోంది? మాములుగా నడిస్తే సరిపోతుంది కదా!’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే తన బాడీపై కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ తప్పా.. ఇంకెక్కడ అందం కనిపించలేదంటూ ఆడేసుకుంటున్నారు.



Next Story

Most Viewed