- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
500 ఏళ్ల నాటి కాలానికి వెళ్తున్న సప్తమి గౌడ.. ‘ఉగ్రాయుధం’మూవీలో యంగ్ హీరోతో రొమాన్స్!
రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఉగ్రాయుధం’లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

దిశ, సినిమా: కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి సప్తమి గౌడ, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఉగ్రాయుధం’లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, చిత్ర బృందం ఆమెను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి చారిత్రక అంశాలకు కల్పిత గాథను జోడించి ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. డెబ్యూ డైరెక్టర్ పునీత్ రుద్రనాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూరమ్ మూవీస్ బ్యానర్‌పై జయరాం దేవసముద్ర నిర్మిస్తున్నారు. సప్తమి గౌడ, శ్రీమురళి కాంబోలో వస్తున్న మొదటి మూవీ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీమురళి ఈ సినిమా కోసం తన రూపాన్ని పూర్తిగా మార్చుకోగా, సప్తమి గౌడ ఇందులో ఒక రాజకుమారి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సప్తమి గతంలో 'కాంతార' లో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చారిత్రక చిత్రం ఆమె కెరీర్‌లో మరో మైలురాయి కానుంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా ఉండబోతోంది. 'సలార్' వంటి భారీ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంకేత్ సినిమాటోగ్రఫీ, అమర్ ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం సప్తమి గౌడ ధనంజయ్ సరసన 'హలగలి' అనే మరో పీరియడ్ ఫిలింలో కూడా నటిస్తున్నారు. 'ది రైజ్ ఆఫ్ అశోక' తర్వాత ఆమె నటిస్తున్న ఈ 'ఉగ్రాయుధం' 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. చారిత్రక నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కావడంతో శ్రీమురళి అభిమానులు కూడా ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






