- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'Kantara' హీరోయిన్
మొత్తానికి 'కాంతార' మూవీ ఈమెకు మంచి ఆఫర్‌లు తెచ్చిపెడుతోంది.

X
దిశ, సినిమా: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'కాంతార' సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సప్తమిగౌడ హీరోయిన్‌గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు, అభిమానుల మన్ననలు కూడా దక్కాయి. ఇక తాజాగా ఈ భామ క్రేజీ ఆఫర్ కొట్టేసింది. స్టార్ డైరెక్టర్ చిత్రంలో చాన్స్‌ను దక్కించుకుంది. 'ది కాశ్మీరీ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రీ దర్శకత్వం వహిస్తున్న 'ది వాక్సిన్ వార్' మూవీలో సప్తమిగౌడ కీలకపాత్రకు ఎంపికైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇలా మూడో సినిమాకే సప్తమికి బాలీవుడ్ నుండి ఆఫర్ రావడం విశేషమనే చెప్పాలి. దీనితో పాటు ఈ బ్యూటీ .. కన్నడంలో మరో మూడు సినిమాల్లోనూ నటిస్తోంది. మొత్తానికి 'కాంతార' మూవీ ఈమెకు మంచి ఆఫర్‌లు తెచ్చిపెడుతోంది.
Next Story






