దుమారం రేపుతున్న సప్తగిరి కామెంట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-11 10:37:27  IST  )

ఈ మధ్యకాలంలో నేను సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరోకో వంటి సినిమాలు చేశాను. అయితే ఇవన్నీ చిన్న స్థాయి చిత్రాలు కావడం వల్ల ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ అవ్వడం లేదు.

దుమారం రేపుతున్న సప్తగిరి కామెంట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ పాపులర్ కమెడియన్ సప్తగిరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, హీరోగా మారి, మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సప్తగిరి.. తన తాజా చిత్రం ‘పురుష’ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 22న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ప్రమోషన్లలో పాల్గొన్న సప్తగిరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సప్తగిరి మాట్లాడుతూ.. "పరిశ్రమకు వచ్చి 18 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాను, అందుకే డబ్బు కోసం కాకుండా నటుడిగా సంతృప్తినిచ్చే పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరోకో వంటి సినిమాలు చేశాను.

అయితే ఇవన్నీ చిన్న స్థాయి చిత్రాలు కావడం వల్ల ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే ఆ ప్రభావం వేరేలా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. సప్తగిరి ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని చిన్న సినిమా అని అనడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని చిన్న సినిమా అనడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గతంలో ఇదే మూవీ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ చిత్రం రూ. 1000 కోట్లు కాదు, ఏకంగా రూ. 2000 కోట్లు వసూలు చేస్తుందని ఆకాశానికెత్తేసిన సప్తగిరి, ఇప్పుడు ఇలా చిన్న సినిమా అని తగ్గించి మాట్లాడటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సప్తగిరిని టార్గెట్ చేస్తూ ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఒక భారీ బడ్జెట్ సినిమాను అవమానించాడని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడుతున్నారు. మరి ఈ వివాదంపై సప్తగిరి ఎలా స్పందిస్తారో చూడాలి.

‘కల్కి’ ప్రపంచంలోక్రిష్ విలన్.. ఈసారి మామూలుగా ఉండదు అంటున్న నెటిజన్లు

Next Story