‘కల్కి’ ప్రపంచంలోక్రిష్ విలన్.. ఈసారి మామూలుగా ఉండదు అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |   (  Updated:2026-05-11 10:38:03  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ఒకటి.

‘కల్కి’ ప్రపంచంలోక్రిష్ విలన్.. ఈసారి మామూలుగా ఉండదు అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ఒకటి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో విలన్‌గా ఫుల్ ఫేమస్ అయిన వివేక్ ఒబెరాయ్ ‘కల్కి 2’ తారాగణంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని టాక్. ఆయన ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో చేస్తున్నాడని తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. క్రిష్ ప్రాంచైజీలో విలన్‌గా అటు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు కల్కి సీక్వెల్‌లో భాగం అయ్యాడు అనే వార్తలతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి.

దుమారం రేపుతున్న సప్తగిరి కామెంట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

Next Story