లోకేష్ కనగరాజ్ అంటే నాకు చాలా కోపం.. అలా చేయడం నాకు నచ్చలేదంటూ సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) ఒకప్పుడు పలు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

లోకేష్ కనగరాజ్ అంటే నాకు చాలా కోపం.. అలా చేయడం నాకు నచ్చలేదంటూ సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) ఒకప్పుడు పలు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం విలన్‌ పాత్రలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. సౌత్ సినిమాలపై దృష్టి పెట్టిన సంజయ్ దత్ వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజ బిజీగా మారిపోయాడు. త్వరలోనే ఆయన కన్నడలో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా హీరోగా ‘కేడీ ది డేవిల్’ (KD the Devil)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వయోలెంట్ అండ్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రేష్మ నానయ్య హీరోయిన్‌గా నటించగా.. శిల్పా శెట్టి(Shilpa Shetty), రమేశ్ అరవింద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రేమ్ దర్శకత్వం వహించాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. ఇటీవల టీజర్ విడుదల చేశారు.

ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేను దలపతి విజయ్‌తో కలిసి పని చేశాను. ఆయనతో కలిసి పని చేయడాన్ని చాలా ఇష్టపడ్డాను. కానీ నాకు లోకేష్ కనగరాజ్ మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే.. ఆయన నాకు చాలా చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. అది నాకు అస్సలు నచ్చలేదు. లియో సినిమా ఖైధీ, విక్రమ్ ల స్థాయిలో ఉంటుందని నేను అనుకున్నాను. కానీ చివరికి అది పెద్ద డిజాస్టర్ అయింది. ‘లియో’లో ఒక రకంగా నన్ను వృథా చేశాడు. ఏది ఏమైనా నేను మాత్రం ఆ సినిమా విషయంలో చాలా ఎంజాయ్ చేశాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించాడు. అలాంటిది మంచి క్యారెక్టర్ ఇవ్వకపోవడమేంటని? పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

LINK

Next Story