- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీసు వద్ద సంగీత్ శోభన్ మాస్ రాంపేజ్.. ‘రాకాస’ సినిమా ఫస్ట్ డే లెక్కలివే!
ఒక యంగ్ హీరో సినిమాకు, అదీ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఈ వారం ఒక చిన్న సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నిహారిక కొణిదెల నిర్మాణంలో, యంగ్ హీరో సంగీత్ శోభన్ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘రాకాస’ థియేటర్లలో రచ్చ లేపుతోంది. పెద్ద సినిమాల సందడి మధ్యలో సైలెంట్‌గా వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు కలెక్షన్ల పరంగా వైలెంట్‌గా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. ‘రాకాస’ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 5.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక యంగ్ హీరో సినిమాకు, అదీ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో, ఫస్ట్ డే మార్నింగ్ షోల నుండే థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోయాయి.
ఈ సినిమా సక్సెస్‌లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ మేజర్ రోల్ ప్లే చేస్తోంది. హారర్ సీన్లతో భయపెడుతూనే, ఈ కామెడీ గ్యాంగ్ పండించిన నవ్వులు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. దీనికి తోడు అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. నిహారిక టీమ్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ వల్ల ఈ సినిమా ఇప్పుడు బుక్‌మైషోలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం, ఈ మూవీ క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా రూ. 12 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న క్రేజ్, వీకెండ్ అడ్వాంటేజ్ చూస్తుంటే ఈ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. వీకెండ్ ముగిసేలోపే ఈ ‘రాకాస’ లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.






