- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ సపోర్ట్‌పై నోరు విప్పిన సంగీత్ శోభన్.. నెటిజన్ల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్!
చాలామంది ఏమనుకుంటారంటే, మా నాన్నగారు తీసిన ‘వర్షం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్లే ప్రభాస్ గారు నన్ను, మా అన్నయ్యను ఎంకరేజ్ చేస్తున్నారని అనుకుంటారు.

దిశ, సినిమా: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాకాస’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుండగా, మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఫ్యాంటసీ జానర్‌లో రాబోతున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాధారణంగా శోభన్ బాబు వారసులుగా వస్తున్న సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సినిమాలకు ప్రభాస్ తన వంతు మద్దతు ఇస్తుంటారు. అయితే, ప్రభాస్ కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి ‘వర్షం’ సినిమాను శోభన్ గారు నిర్మించడం వల్లే ఆయన ఇప్పుడు కృతజ్ఞతగా వీరిని ఎంకరేజ్ చేస్తున్నారని కొందరు అనుకుంటున్నారు. ఈ విషయంపై పలు పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. కొందరు దారుణంగా విమర్శిస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత్ శోభన్ ఈ విషయంపై స్పందించారు.
"చాలామంది ఏమనుకుంటారంటే, మా నాన్నగారు తీసిన ‘వర్షం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్లే ప్రభాస్ గారు నన్ను, మా అన్నయ్యను ఎంకరేజ్ చేస్తున్నారని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఒకవేళ ఆ సినిమా డిజాస్టర్ అయి ఉన్నా సరే, ప్రభాస్ గారు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేసేవారు. ఎందుకంటే అది ఆయన క్యారెక్టర్. ఒక మనిషికి సహాయం చేయాలన్నా, తోడుగా ఉండాలన్నా ఆయన ఫలితం గురించి ఆలోచించరు" అని చెప్పుకొచ్చారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న సంగీత్ శోభన్, ఈ ‘రాకాస’ చిత్రంతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. గెటప్ శ్రీను, వాసు ఇంటూరి వంటి కామెడీ స్టార్స్ ఉండటంతో ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.






