- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన
కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 239 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో రూ.2,284 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం కోహెడ అంతర్జాతీయ పండ్లమార్కెట్ ను నిర్మించనుంది. రంగారెడ్డ జిల్లా ఔటర్ రింగురోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఈ మార్కెట్ నిర్మాణం చేపట్టడంపై అక్కడి రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ ను ఆకర్షించేలా ఆధునిక వసతులతో మార్కెట్ నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మార్కెట్లో భారీ కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, వేర్ హౌస్ లు, గ్రేడింగ్, స్టారింగ్, ప్యాకింగ్ కేంద్రాలు, ఎగుమతులకోసం ప్రత్యేక లాజిస్టిక్స్ హబ్, ట్రక్ టెర్మినల్స్, పార్కింగ్ యార్డ్స్, డిజిటల్ వేలం, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబులను నిర్మించనున్నారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే.. రైతులు ఇకపై మధ్యవర్తులపై ఆధారపడటం తగ్గుతుంది. పంటలకు మెరుగైన ధరలు వచ్చే ఛాన్సుంటుంది. కోతల తర్వాత నష్టాలు తగ్గి, ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం వల్ల దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.






