- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు70.. మీకు 30 శాతం..!
ఇండియా, నేపాల్ సరిహద్దులో నిందితుల ఫోటోలతో విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రధాన నిందితులు ఎస్కేప్ కాకుండా మల్కాజిగిరి పోలీసులు స్కెచ్ వేయడంతో 25 రోజుల తర్వాత నేపాలీ మమతతో పాటు మరో ముగ్గురు పోలీసులకు దొరికిపోయారు.

దిశ, సిటీక్రైం : ఇండియా, నేపాల్ సరిహద్దులో నిందితుల ఫోటోలతో విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రధాన నిందితులు ఎస్కేప్ కాకుండా మల్కాజిగిరి పోలీసులు స్కెచ్ వేయడంతో 25 రోజుల తర్వాత నేపాలీ మమతతో పాటు మరో ముగ్గురు పోలీసులకు దొరికిపోయారు. వారి వద్ద నుంచి మొత్తం చోరీ సోత్తును పోలీసులు రికవరీ చేశారు. శనివారం సికింద్రాబాద్ మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సుమతి, డీసీపీ శ్రీధర్, కలిసి వివరాలను వెల్లడించారు. నేపాల్ కు చెందిన మీనా అలియాస్ మమత, రాజేష్ లు కొద్ది సంవత్సరాల కిందట దేశంలోకి వచ్చి వివిధ ప్రాంతాల్లో వంట మనుషులుగా పనులకు చేరారు. వారికి ఈ ఉద్యోగంతో వస్తున్న డబ్బు సరిపోకపోవడంతో మమత, రాజేష్ తో కలిసి భారీ దోపీడీకి స్కెచ్ వేసింది. దీంట్లో భాగంగా జవహార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రోఫెసర్ దంపతులైన మరళి మోహన్, విజయలక్ష్మీ దంపతుల ఇంట్లో వంట మనుషులుగా చేరారు. ఆ ఇంట్లో కొన్ని నెలలుగా ఉంటూ దంపతులను నమ్మించారు.
వృద్దులైన ఈ దంపతులను దోచుకునేందుకు మమత, రాజేష్ లు, హైదరాబాద్ లో స్థిరపడ్డ కొంత మంది నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సామ్రాట్, సబీనా, డానియల్, కిరణ్, బిస్వాల్, జంకర్, కమల్ లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. మమత సీనియర్ సిటిజన్ లైన్ ప్రొఫెసర్ దంపతులను దోచుకునేందుకు మే 12 న తేది ఫిక్స్ చేసుకుని తన ముఠా లోని కొందరిని ఆ ఇంట్లోకి వివిధ పనుల చేస్తారని తీసుకువచ్చింది. ఇలా వచ్చిన వారితో 12న బర్త్ డే సెలబ్రేషన్స్ డ్రామాను రూపొందించి రాత్రి 7.30 గంటలకు సర్వెంట్ క్వార్టర్స్ నుంచి ఇంట్లోకి ప్రవేశించి వారిని కట్టేసి దోపీడీని ప్రారంభించారు. మరుళిమోహన్ కు మత్తు పదార్ధం ఇవ్వగా.. అతని భార్యను కట్టేసి నోటికి ప్లాస్టర్ పెట్టి దాదాపు 2 గంటల పాటు ఇంట్లో అల్మారా, ఇతర కప్ బోర్డుల తాళాలను ధ్వంసం చేసి 68 తులాల బంగారం, 15 కేజీల వెండి ఆభరణాలు, 3 వేల అమెరికన్ డాలర్ లను దోచుకున్నారు. 9.30 బయటికి వచ్చి రెండు గ్రూపులుగా విడిపోయి అక్కడి నుంచి పారిపోయి యాప్రాల్ కు చేరుకున్నారు. అక్కడ చోరీ సోత్తులో మమత, రాజేష్, డానియల్, కిరణ్ లు 70 శాతం, సునిత, బిస్వాల్, కమల్, జంకర్ 30 శాతం వాటా పంచుకుని టాక్సీ లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుని ఎస్కేప్ అయ్యారు. దోపీడీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జవహార్ నగర్, ఎస్ఓటీ, సీసీఎస్, ఇతర విభాగాల పోలీసులు సిబ్బంది 72 గంటల్లో సునిత, బిస్వాల్, కమల్, జంకర్ లను అరెస్టు చేసి 30 శాతం వాటాను మే 17న రికవరీ చేసి వారిని జైలుకు పంపారు.
255 సీసీ కెమెరాలు, ఇతర టెక్నాలజీ సహాయంతో
25 రోజుల తర్వాత జవహార్ నగర్ పోలీసులు ప్రధాన సూత్రధారి మమత తో పాటు మరో ముగ్గురిని శనివారం అరెస్టు చేసి 70 శాతం చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు. మమత్ గ్యాంగ్ కోసం పోలీసులు ఢిల్లీ, పూణే, బెంగళూరు, నేపాల్ సరిహద్దులు, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నిరంతరం గాలించారు. ఈ నిందితుల ఫోటోలను పలు రాష్ట్రాలతో పాటు నేపాల్ సరిహద్దులో ప్రచారం చేయడంతో మమత, మరో ముగ్గురు నేపాల్ లోకి వెళ్ళకుండా ఉచ్చు బిగించారు. దీంతో వారు తిరిగి హైదరాబాద్ బోయిన్ పల్లి ప్రాంతంలో తిరుగుతుండగా దొరికిపోయారు. ఈ ముఠాను పట్టుకున్న జవహార్ నగర్ , ఎస్ఓటీ, సీసీఎస్ ఇతర పోలీసు విభాగాల అధికారులు, సిబ్బందిని సీపీ సుమతి అభినందించి వారికి రివార్డులను అందించారు. మమత, రాజేష్ లు 2023లో మొయినాబాద్ లో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడి అరెస్టు అయినట్లు సీపీ తెలిపారు. ఆ కేసులో సేకరించిన ఫింగర్ ప్రింట్స్, ఫోటోలు మమత గ్యాంగ్ గాలించేందుకు ఉపయోగపడ్డాయని ఆమె తెలిపారు.






