అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా .. ‘స్పిరిట్’ పోస్టర్‌తో సోషల్ మీడియా షేక్!

by Mallepaka Hamsa |

అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా .. ‘స్పిరిట్’ పోస్టర్‌తో సోషల్ మీడియా షేక్!
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కలయికలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’(Spirit). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా దర్శకుడు సందీప్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటిస్తూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. అయితే, ఆ పోస్టర్‌లో వివేక్ పక్కన ఉన్న ఒక కొత్త ముఖం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివేక్ ఒబెరాయ్‌తో కలిసి పోస్టర్‌లో కనిపించిన ఆ నటి పేరు ఐశ్వర్య దేశాయ్. ఈ పోస్టర్ విడుదలైన నిమిషాల్లోనే నెటిజన్లు ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఐశ్వర్య దేశాయ్ ఇండియన్-అమెరికన్ నటి. ఆమె ఇప్పటికే బాలీవుడ్ హిట్ చిత్రం ‘గల్లీ బాయ్’లో నటించి మెప్పించింది.

అలాగే ‘ర్యాట్ ఇన్ ద కిచెన్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా అందుకుంది. చదువులోనూ ఫస్ట్ క్లాస్ అనిపించుకున్న ఐశ్వర్య, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుండి మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్ చాలా బోల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐశ్వర్యను విలన్ వివేక్ ఒబెరాయ్‌తో కలిపి చూపించడంతో, సినిమాలో వీరిద్దరి జంట ప్రభాస్‌ను ఢీకొట్టే రేంజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య దేశాయ్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఈ ఒక్క పోస్టర్‌తోనే ఐశ్వర్య ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించుకుందనడంలో అతిశయోక్తి లేదు.

Next Story