ఆ హీరోయిన్‌‌తో సందీప్ కిషన్ డీప్ కిస్.. ఫొటో వైరల్

by Dishanational4 |
ఆ హీరోయిన్‌‌తో సందీప్ కిషన్ డీప్ కిస్.. ఫొటో వైరల్
X

దిశ, సినిమా: రంజిత్ జెయకోడి దర్శకత్వంలో యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయిక నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లో హీరోహీరోయిన్ల మధ్య స్పైసీ కిస్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సినిమాను భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :చైతు సినిమాలో ప్రియమణి కీలక పాత్ర





Next Story