'మైఖేల్' ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. ఫ్రీగా రెండువేల 'ఆహా' సబ్‌స్క్రిప్షన్లు!

by Disha Web Desk 13 |
మైఖేల్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. ఫ్రీగా రెండువేల ఆహా సబ్‌స్క్రిప్షన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల 'మైఖేల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రంజిత్ జయ కోడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 3న రిలీజ్ అవగా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీ లోనూ సందడి చేసేందుకు రెడీ అయిన ఈ మూవీ 'ఆహా' వేదికగా ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగానే హీరో సందీప్ కిషన్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 2 వేల 'ఆహా' సబ్‌స్క్రిప్షన్లు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.

'మై డియర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్.. ఎల్లప్పుడు నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. సినిమాపై నాకున్న ప్రేమను, నా ప్రయత్నాలను ఆదరించినందుకు కృతజ్ఞతలు. మీ అభిమానం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. ఆహాలో 'మైఖేల్' ప్రీమియర్ సందర్భంగా 2 వేల మందికి ఆహా సబ్‌స్క్రిప్షన్లు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా. ఈ శుక్రవారం 'మైఖేల్' ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది' అంటూ ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశాడు.



Next Story

Most Viewed