ప్రేక్షకుల మెప్పు పొందినా.. బాడీ షేమింగ్ తప్పలేదు : సనా కపూర్

by Disha Web Desk 7 |
ప్రేక్షకుల మెప్పు పొందినా.. బాడీ షేమింగ్ తప్పలేదు : సనా కపూర్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సనా కపూర్.. పెళ్లి, బాడీ షేమింగ్‌ సంబంధిత విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు పేరెంట్స్ సుప్రియా పాఠక్, పంకజ్ కపూర్‌తో కలిసి నటించే ముందు భయాందోళనకు గురయ్యానన్న నటి కాలక్రమంలో సులభంగా ఫీల్ అయినట్లు తెలిపింది. అలాగే 2015లో విడుదలైన 'షాందార్‌' మూవీలో పోషించిన విభిన్న పాత్ర ద్వారా ప్రేక్షకుల మెప్పు పొందినప్పటికీ కొంతమంది తన క్యారెక్టర్‌ను కిల్ చేసేందుకు బాడీ షేమింగ్‌కు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ సమయంలో తన పేరెంట్స్, ఫ్రెండ్స్ అండగా నిలిచారని పేర్కొంది. ఎప్పుడు కూడా వారి సలహాలు, మద్ధతు ఓ బలమైన భుజం అందించినట్లుగా ఉంటాయని చెప్పింది. ఇక కొన్ని కఠిన సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డానన్న సన.. వర్షంలో 20 గంటలు డ్యాన్స్ చేస్తానని ఊహించలేనని, షూటింగ్‌లోనే స్కూటీ నడపడం నేర్చుకున్నట్లు తెలిపింది. అంతేకాదు తన లవ్ మ్యారేజ్‌కు పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ఆనందానికి హద్దులు లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed