ధనుష్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంయుక్త మీనన్.. తన కోరిక బయటపెడుతూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-30 10:41:20  IST  )

ఆయన ఒక కథను ఎంచుకున్నారంటే, అది ఖచ్చితంగా గొప్ప స్క్రిప్ట్ అయి ఉంటుందని కళ్లు మూసుకుని నమ్మవచ్చు.

ధనుష్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంయుక్త మీనన్.. తన కోరిక బయటపెడుతూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న సంయుక్త ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ ముద్దుగుమ్మ, తాజాగా తన ఫేవరెట్ కో-స్టార్ ధనుష్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 2023లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాతి’ (తెలుగులో ‘సార్’) పేరుతో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త, తన కోరికను బయటపెట్టింది. "ధనుష్ సర్ ఒక అద్భుతమైన నటుడు. ఆయన ఒక కథను ఎంచుకున్నారంటే, అది ఖచ్చితంగా గొప్ప స్క్రిప్ట్ అయి ఉంటుందని కళ్లు మూసుకుని నమ్మవచ్చు.

ఆయనకున్న స్క్రిప్ట్ సెన్స్ అంత బాగుంటుంది" అని ప్రశంసలు కురిపించింది. ‘సార్’ సినిమా షూటింగ్ సమయంలోని అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. సెట్స్‌లో ధనుష్ చాలా సైలెంట్‌గా ఉంటారని, పుస్తకాలు చదువుతూ తన పనిలో తాను నిమగ్నమై ఉంటారని తెలిపింది. కెమెరా ముందు ఆ ఒక్క క్షణం కోసమే అతను తనదంతా శక్తినంతా దాచిపెట్టుకున్నట్లు ఉంటుంది. డైరెక్టర్ యాక్షన్ అనగానే తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారని సంయుక్త చెప్పుకొచ్చింది. ఆఫ్-స్క్రీన్ ప్రశాంతంగా ఉండే ధనుష్, ఆన్-స్క్రీన్ అంత ఎనర్జీని ఎలా చూపిస్తారో చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపింది. 2025లో ‘అఖండ 2: తాండవం’ వంటి భారీ చిత్రాలతో మెరిసిన సంయుక్త, 2026లో స్వయంభూ, బ్లాక్ గోల్డ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలోనే మళ్లీ ధనుష్ వంటి వర్సటైల్ యాక్టర్‌తో పని చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటికే ‘సార్’ మూవీతో మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ జోడీ, మళ్లీ వెండితెరపై కనిపిస్తే బాగుంటుందని అటు తమిళ, ఇటు తెలుగు అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Next Story