- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంయుక్త మీనన్ మరో ఛాన్స్.. ఆ మెగా హీరోతోనే ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో సంయుక్త మీనన్ ఒకరు. బింబిసారా, సార్, విరూపాక్ష సినిమాలతో... హీరోయిన్ సంయుక్త మీనన్ మంచి.. క్రేజ్ సంపాదించుకుంది.
తెలుగు ప్రేక్షకులు కూడా.. ఆమె సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి హీరోయిన్ సంయుక్త మీనన్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయి ధరంతేజ్ తో జతకట్టిన సంయుక్త మీనన్... ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిలో కూడా ఛాన్స్ కొట్టేసిందట.
అనిల్ రావిపూడి అలాగే మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో.. రెండవ హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ నయనతార అన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారు అని టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.






