‘స్వయంభు’ సినిమా కోసం సంయుక్త కసరత్తు.. గ్రేట్ అంటున్న నెటిజన్లు(పోస్ట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ (Samyuktha Menon)త్వరలోనే తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమవుతోంది.

‘స్వయంభు’ సినిమా కోసం సంయుక్త కసరత్తు.. గ్రేట్ అంటున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ (Samyuktha Menon)త్వరలోనే తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమవుతోంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘స్వయంభు’(Swayambhu) లో ఆమె కథానాయికగా నటిస్తోంది. భరత్ కృష్ణమాచారి(Bharat Krishnamachari) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో ప్రకంపనలు సృష్టించగా, తాజా అప్‌డేట్స్‌తో సంయుక్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన సంయుక్త, ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని సెట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఈ పాత్ర కోసం ఆమె ఎంతలా కష్టపడిందో ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది.

కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఒక యోధురాలి పాత్రలో మెప్పించేందుకు ఆమె స్వయంగా గుర్రపు స్వారీనేర్చుకుంది. అంతేకాకుండా, కత్తిసాము వంటి యుద్ధ విద్యల్లో కూడా కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు ఆ ఫొటోలు చూపిస్తున్నాయి. సంయుక్త డెడికేషన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘వావ్.. సంయుక్త గ్రేట్! కేవలం అందమే కాదు.. అంకితభావం కూడా ఎక్కువే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం డూప్‌లను వాడుతుంటారు, కానీ సంయుక్త మాత్రం రిస్క్ తీసుకుని మరీ ఒరిజినల్‌గా చేయడం విశేషం. ఈ చిత్రంలో ఆమె ఒక యువరాణిగా లేదా యోధురాలిగా కనిపించబోతోందని తాజా ఫొటోలు హింట్ ఇస్తున్నాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story