‘సంబరాల ఏటిగట్టు’ విడుదల వాయిదా.. కీలక ప్రకటనతో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

మెగా హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yeti Gattu ).

‘సంబరాల ఏటిగట్టు’ విడుదల వాయిదా.. కీలక ప్రకటనతో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yeti Gattu ). రోహిత్ కేపీ (Rohit KP)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రం సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

ఇక అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విడుదల కాబోతుండటంతో మామ కోసం అల్లుడి చిత్రాన్ని వాయిదా వేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ టీమ్ ట్విట్టర్ ద్వారా ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘సంబరాల ఏటిగట్టు' మా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి. పవర్ ఫుల్ స్టోరీని ప్రపంచ స్థాయి టెక్నికల్ ప్రమాణాలతో బెస్ట్‌గా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ఊహించని స్ట్రైక్, కొన్ని కీలక CG పనుల కారణంగా ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సినిమా విడుదల తేదీ వాయిదా వేయాలని నిర్ణయించాం. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎంతో డెడికేషన్‌తో ఈ ప్రాజెక్టు కోసం శ్రమిస్తున్నారు.

అలాగే మా డైరెక్టర్ రోహిత్ కెపి తన డ్రీమ్ ప్రాజెక్టును సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఎంతో నిబద్ధతో ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్ అందించేందుకు మేము ఎక్కడా రాజీ పడడం లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి మాకు సపోర్ట్ చేస్తోన్న మీడియా మిత్రులకు, ఆడియన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు ఓర్పు, నమ్మకంతో వేచి ఉంటే మేము మరింత కష్టపడి పనిచేసి ఫ్యూచర్‌లో మీకు గుర్తుండిపోయే మూవీని అందిస్తాం. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం. అలాగే మేము మీకు హామీ ఇస్తున్నాము. వేచి ఉండటం ప్రతి క్షణానికి విలువైనది.. ఇట్లు ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Next Story