విడాకులపై సమంత ట్వీట్ వైరల్.. పెళ్లికి ముందే విడాకులు తీసుకుంటానంటూ..

by Web Desk |
విడాకులపై సమంత ట్వీట్ వైరల్.. పెళ్లికి ముందే విడాకులు తీసుకుంటానంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తో్ంది. అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయాన్ని అభిమానులు ఇంకా పూర్తిగా మర్చిపోకముందే.. తాజాగా మరో స్టార్ జోడి స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమంత గురించి నెట్టింట్లో ఓ వార్త చక్కెర్లు కొడుకుతుంది. వివాహనికి ముందే 2013లో విడాకుల గురించి సమంత చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. అయితే 2013లో సమంత ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ సందర్భంగా ఓ అభిమాని వివాహం, విడాకులు గురించి ఓ ప్రశ్న అడిగాడు. దానికి సమంత 'నేను వివాహం చేసుకుంటా.. తర్వాత విడాకులు తీసుకుంటా. మీరు చూస్తూండండి మనమిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాం' అని సమాధానం ఇచ్చింది. అన్నట్లుగానే సమంత నాగ చైతన్యను వివాహం చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనితో అభిమానులు సమంత‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్ల్ చేస్తున్నారు.

https://twitter.com/Samanthaprabhu2/status/345201446276460544?s=20


Next Story

Most Viewed