Samantha: చాలా సంతోషంగా ఉన్నా.. ఇదంతా అతని వల్లే సాధ్యం అయిందంటూ సమంత షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

స్టార్ బ్యూటీ సమంత(Samantha) ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

Samantha: చాలా సంతోషంగా ఉన్నా.. ఇదంతా అతని వల్లే సాధ్యం అయిందంటూ సమంత షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సమంత(Samantha) ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు మయోసైటీస్‌తో బాధ పడిన ఆమె తన బాడీని యాక్షన్ సీన్లకు సిద్ధం చేయడానికి వర్కౌట్స్ చేస్తూ స్ట్రాంగ్‌గా మారుతోంది. ఓ వైపు ‘మా ఇంటి బంగారం’ (maa inti bangaram)షూటింగ్‌తో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా వరుస పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘ఫుల్ యాక్షన్ మోడ్.. బీస్ట్ మోడ్.. కొన్నేళ్ల క్రితం నా బ్యాక్ బలంగా లేదని కేర్ తీసుకోలేకపోయా. ఎందుకంటే నా జీన్స్‌లో అలా లేదని అనుకునేదాన్ని.

ఎవరినైనా అలాంటి వారిని చూసినప్పుడు నాకు అలా సాధ్యం కాదని అనుకునేదాన్ని. కానీ అదంతా తప్పు అని ఇప్పుడే అర్థమైంది. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. దాన్ని ఇప్పుడు చూపించబోతున్నా. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించా. బాడీలో కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం. మీరు ఎలా కనిపిస్తారనేది చాలా ముఖ్యం. మీరు ఎలా జీవిస్తారు.. ఎలా కదులుతారు.. మీ వయస్సు ఎలా పెరుగుందనేది గమనించాలి. మీ వయసు పెరిగే కొద్ది.. బలమైన శిక్షణే మీ బెస్ట్ ఫ్రెండ్‌గా మారాలి.

ఈ బలమైన శిక్షణే నాకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసింది. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. జన్యువుల వల్ల వచ్చింది కాదని అర్థమైంది. ఇదంతా అతని వల్ల సాధ్యం అయింది. నువ్వు ఏదైనా వదులుకునే దశలో ఉంటే ఇప్పుడు అస్సలు వదులకోవద్దు.. అలానే ముందుకు సాగితే భవిష్యత్తు బాగుంటుంది’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం వావ్ సామ్ సూపర్ ఫిట్‌నెస్ అంటూ ఫైర్ ఎమోజీలు.. హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.

Next Story