- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు ఫుల్ డీటెయిల్స్!
గత కొద్ది కాలంగా రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమంత(Samantha) చెక్ పెట్టింది.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమంత(Samantha) చెక్ పెట్టింది. ప్రియుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను నేడు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లాడింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమంత సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అతి కొద్ది మంది సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా.. కొత్త జంటకు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే.. సమంత రెండో భర్త రాజ్ నిడిమోరుకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఆయన పుట్టి పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోనే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజ్ అమెరికా వెళ్లగా.. అక్కడ సినిమాపై ఆసక్తి కలిగింది.
ఈక్రమంలోనే తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న డీకేతో పరిచయం ఏర్పడగా.. వీరిద్దరు కలిసి మొదట ఓ షార్ట్ ఫిలిం చేశారట. అది సక్సెస్ కావడంతో ‘ఫ్లేవర్స్’అనే ఇంగ్లీష్ మూవీ తెరకెక్కించి దర్శకులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన రాజ్, డీకే హిందీలో ‘99’అనే సినిమాకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపును రాబట్టుకున్నారు. ఇక తెలుగులోనూ ‘ఇంకోసారి’ చిత్రానికి రైటర్స్‌గా పనిచేశారు. షోర్ ఇన్ ది సిటీ, గో గోవా డాన్, డీ ఫర్ దోపిడీ వంటి చిత్రాలకు నిర్మాతలుగా కూడా వ్యవహరించారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్న రాజ- డీకేలకు ‘ది ఫ్యామిలీ మ్యాన్’సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పాలి.
ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను మెప్పించగా.. దీంతో రెండో సీజన్‌లో విలన్‌గా సమంతను ఎంపిక చేశారు. ఈ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది. దీంతో రాజ్ సమంతని లీడ్ రోల్‌లో పెట్టి ‘సిటాడెల్’అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇక ఈ సమయంలోనే సమంత-రాజ్ మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటినుంచి రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఇటీవల పలుచోట్ల క్లోజ్‌గా కనిపించారు. కానీ ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఈక్రమంలోనే.. సమంత సడెన్‌గా అధికారికంగా ప్రకటించింది.






