ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోండి.. వివాహంపై Samantha పోస్ట్ వైరల్

by sudharani |
ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోండి.. వివాహంపై Samantha పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమా పూర్తి చేసుకుని కొంత కాలం రెస్ట్ తీసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తను తీసుకున్న అడ్వాన్స్‌లు కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసి.. పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు సద్గురు ఇషా సెంటర్‌లో కూడా జాయిన్ అయిపోయింది సామ్. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట షేర్ చేసింది.

ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. మూవీ విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే.. విజయ్ తన ఇన్‌స్టాలో సమంతతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. ‘నాలాంటి ప్రేమ’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు అదే వీడియో సమంత తన స్టోరిస్‌లో షేర్ చేస్తూ.. ‘‘ఇలాంటి కేరింగ్ ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోండి’’ అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పింది బ్యూటీ. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. ఈ వీడియో చూస్తే నాగచైతన్య పరిస్థితి ఏంటో అన్నట్లుగా కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Click Here For Hot Latest Photo Gallery


Read More: జాన్వీ కపూర్‌ని అక్కడ కొరికేసిన వరుణ్ ధావన్.. ఫొటోస్ వైరల్..

Next Story

Most Viewed