- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ పెళ్లి విషయంలో తొందరపడ్డా.. అసలు విషయాలు రివీల్ చేస్తూ సమంత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సినిమాలకు దూరం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం నిర్మాతగా మారి పలు చిత్రాలు తెరకెక్కిస్తోంది. త్వరలోనే ఆమె ‘మా ఇంటి బంగారం’ (ma inti bangaram) చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర పోస్టులతో వార్తల్లో నిలస్తోంది. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ముప్పై ఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే తీరు మారుతుంది. ప్రతిదీ తగ్గుముఖం పడుతుంది. మీ అందం, మీ మెరుపు అన్నిట్లో మార్పు వస్తుంది. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలంటే ఇరవైలలోనే ఏదైనా చేయాలి.
లేదంటే మీకు ప్రతి దానికి సమయం మించిపోయినట్లు అనిపిస్తుంటుంది. నాకు ఇరవైలలో ఉన్నప్పుడు విశ్రాంతి లేకుండా గందరగోళంగా గడిపాను. గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. ఆ సమయంలో నన్నే నేను ఎంత కోల్పోయానో ఎవరికీ తెలియదు. ఏదీ కనిపించకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను. ఆ సమయంలో, ప్రేమ గురించి అప్పుడు నాకెవరూ చెప్పలేదు. నిజమైన ప్రేమ మనలోనే ఉంటుందనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని తర్వాత అర్థం చేసుకున్నా’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.






