- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుణ్ ధావన్‌తో సమంత శృంగారం.. క్లారిటీ ఇచ్చిన ‘సీటాడెల్’ టీమ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలసి ‘సీటాడెల్’ హిందీ వెర్షన్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సిటాడెల్ ఇంగ్లిష్ వెర్షన్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేసింది. ఇందులో శృంగార సన్నివేశాల్లో ఆమె చెలరేగిపోయింది. హీరోతో లిప్ లాక్ సన్నివేశాలు చేసి రచ్చ చేసింది. ఇప్పడు సమంత కూడా అదే రేంజ్‌లో రెచ్చిపోతుందనే వార్తలు జోరందుకున్నాయి. తాజాగా, దీనిపై సీటాడెల్ మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. సీటాడెల్‌లో వరుణ్ ధావన్‌తో సమంత ఇంటిమేట్ సీన్లు ఏమీ లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా సామ్ బోల్డ్ సీన్స్‌లో నటించడం లేదని తెలిపారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కొంతమంది ఈ జాగ్రత్త ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2’ లో కూడా ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. గతంలో ఈ వెబ్ సీరిస్‌లో సమంత బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయి నటించి పలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Read More: యూఎస్‌లో ‘ఆదిపురుష్’ బుకింగ్ స్టార్ట్!






