తమన్నా- విజయ్ వర్మ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తుండగా రూమ్‌లోకి వెళ్లిన సమంత.. తర్వాత ఊహించని సీన్!

by Disha Web Desk 6 |
తమన్నా- విజయ్ వర్మ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తుండగా రూమ్‌లోకి వెళ్లిన సమంత.. తర్వాత ఊహించని సీన్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గత కొద్ది కాలంగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈ అమ్మడు తెలుగు హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇటీవల ఓ వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆమె నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తమన్నా వాటిపై స్పందించి తాను విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి మిల్కీ బ్యూటీ ఒకపక్క వరుస చిత్రాల్లో నటిస్తూనే.. కాలీ సమయాల్లో ప్రియుడితో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.

ఈ క్రమంలో, తాజాగా, తమన్నా ప్రియుడు విజయ్ వర్మతో కలిసి అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ కార్యక్రమానికి సమంత-నాగచైతన్యతో పాటు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా వెళ్లారు. అయితే ఒకే రూమ్ తమన్నా-విజయ్ రెడీ అవుతుండగా సమంత సడెన్‌గా వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చింది. వీరిద్దరు సరదాగా మాట్లాడుకుంటుండగా విజయ్ ఫొటో తీశాడు. దీనిని సమంత-తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అందులో తమన్నా-విజయ్ ఒకే కలర్ బాత్ డ్రెస్ ధరించి కనిపించారు. ఇక ఈ ఫొటోలు చూసిన వారంతా పెళ్లి కాకుండానే తమన్నా- విజయ్ ఒకే రూమ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More..

పుష్ప-2’ నుంచి శ్రీవల్లీ లుక్స్ లీక్.. రష్మిక ఎంత అందంగా ఉందో చూస్తే అదుర్స్ అనాల్సిందే!




Next Story

Most Viewed