బిగ్ షాకిచ్చిన సమంత.. ఈ రోజే రాజ్ నిడిమోరుతో పెళ్లి.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-12 10:40:39  IST  )

తాజాగా, ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో రాజ్ నిడిమోరును సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.

బిగ్ షాకిచ్చిన సమంత.. ఈ రోజే రాజ్ నిడిమోరుతో పెళ్లి.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండటంతో పాటుగా.. వెకేషన్లకు, స్పెషల్ ఈవెంట్లకు కూడా జంటగా హాజరవుతున్నారు. ఈక్రమంలోనే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. సమంత స్వయంగా రాజ్‌ను హత్తుకున్న అనేక పిక్స్‌ను షేర్ చేయడంతో, వారి బంధం సాదారణ స్నేహం కాదని మీడియా అంచనా వేసింది. ఫ్యాన్స్ కూడా ఈ పోస్టులను చూసి షాక్ అయ్యారు. కానీ వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని మాత్రం అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే శ్యామలిదేతో పెళ్లైన రాజ్ నిడిమోరు ఆమెతో విడిపోయినట్లు సమాచారం. ఇక వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఆమె కూడా సోషల్ మీడియాలో పలు సంచలన పోస్టులు షేర్ చేస్తోంది. అయినప్పటికీ సమంత మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తూ.. రాజ్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

గతంలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు రాగా.. ఈక్రమంలోనే సమంత ఓ కొత్త ఇంటికి కూడా కొనుగోలు చేయడం గమనార్హం. కొత్త కాపురం ప్రారంభించడం కోసమే కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి టీములు మాత్రం ఈ విషయాలపై ఒక మాట కూడా అధికారికంగా వెల్లడించలేదు. గత కొద్ది రోజుల నుంచి సమంత, రాజ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో రాజ్ నిడిమోరును సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. అయితే దీనిపై సమంత, రాజ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ రాజ్ నిడిమోరు భార్య చేసిన మాత్రం క్రిప్టిక్ పోస్ట్‌ మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

‘‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’’ అనే కొనేషన్ షేర్ చేయడం గమనార్హం. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా సమంత, రాజ్ పెళ్లి గురించే ఇలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు. మొత్తానికి సమంత మాత్రం రెండో పెళ్లికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇది సమంతకు, రాజ్‌కు రెండో పెళ్లి కావడం అందరినీ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సామ్‌కు రెండోపెళ్లి వాడు తప్ప మరొ వ్యక్తి దొరకలేదా? అని కొందరు విమర్శలు చేస్తున్నారు. కాగా.. సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘ఏమాయ చేసావే’ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు కొద్ది కాలం పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పింగి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి కాపురం మున్నాళ్ల ముచ్చటగా మారింది. కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక డైవర్స్ తర్వాత నాగచైతన్య యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సమంత విషయానికొస్తే.. మయోసైటీస్ వ్యాధి బారిన పడగా.. కొద్ది కాలంపాటు చికిత్స తీసుకుంది. ఆ తర్వాత నుంచి రాజ్ నిడిమోరుతో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇక ఇప్పుడు వీరు వివాహ బంధంలోకి అడుగు పెడుతుండటం చర్చకు దారితీసింది.

Next Story