కాళ్లకు మెట్టెలతో కనిపించిన Samantha..

by Disha Web Desk 9 |
కాళ్లకు మెట్టెలతో కనిపించిన Samantha..
X

దిశ, సినిమా: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్‌.. ట్రీట్‌మెంట్‌ కోసం ప్రొఫెషనల్‌ కెరీర్ నుంచి విరామం తీసుకుంది. ఇక సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరక్కెకిన ఈ మూవీ సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇందులో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. దీంతో చాలా వరకు యూత్‌కు కనెక్ట్ అయిపోతుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూ పోస్టర్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో సమంత కాళ్లకు మెట్టెలతో కనిపించడం ఇందుకు కారణం కాగా సమంత క్యారెక్టర్ అదిరిపోనుందని ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

Chiranjeevi ‘Bhola Shankar’ చిత్రబృందానికి కోర్టు గుడ్ న్యూస్

మరో మూడేళ్లలో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన విజయ్



Next Story

Most Viewed