Samantha: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత.. ఎట్టకేలకు ఆ విషయంపై ఓపెన్ అయిపోయిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-21 05:00:38  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.

Samantha: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత.. ఎట్టకేలకు ఆ విషయంపై ఓపెన్ అయిపోయిందిగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చిన ‘శుభం’ (shubham) మూవీకి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. గతంలో ‘మా ఇంటి బంగారం’ (maa inti bangaram)చిత్రంలో రాబోతున్నట్లు ప్రకటించి కానీ అప్డేట్స్ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం పలు యాడ్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో సామ్ పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందని అంతా అనుకుంటున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘నాలో చాలా మార్పు వచ్చింది. ఫిట్‌నెస్, మూవీస్‌పై దృష్టి పెట్టాను. మంచి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్నాను. అన్నీ మనసుకి దగ్గరగా ఉన్న కథలే.

అందుకే గతంలో లాగా నేను ఎక్కువ సినిమా చేయాలనుకోవడం లేదు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ఒకేసారి ఐదు సినిమాలు చేయను. నా శరీరం చెప్పింది వింటాను తక్కువ ప్రాజెక్ట్స్ చేస్తాను. అయినప్పటికీ ప్రేక్షకుల మనసుకు నచ్చే వాటితోనే వస్తాను. ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా.. కచ్చితంగా నాణ్యత కలిగిన చిత్రాలే చేయాలని డిసైడ్ అయ్యాను. ఇకపై అలాంటి కథలే ఒప్పుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. అసలు సమంత ఏం చేయాలనుకుంటుందో అని అంతా ఆలోచనల్లో పడ్డారు. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందా.. అందుకే ఇలాంటి కామెంట్స్ చేసిందా అని చర్చించుకుంటున్నారు.

Next Story