స్కీయింగ్ చేస్తూ పడిపోయిన సమంత.. వీడియో వైరల్

by Web Desk |
స్కీయింగ్ చేస్తూ పడిపోయిన సమంత.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : టాలీవుడ్ నటి సమంత, నాగచైతన్యతో విడాకుల తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మంచు కొండల అందాలు ఆస్వాదిస్తున్నట్లు తెలిపిన బ్యూటీ.. అక్కడే స్కీయింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ.. స్కీయింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయానని, ట్రైనర్ లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెప్పింది.

'పసి పిల్ల మాదిరి నా స్కీయింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాను. 100 సార్లు జారి పడిపోయాను కానీ ప్రతిసారీ లేచాను. స్కీయింగ్ నుంచి నిష్క్రమించాలనే ఆలోచన చాలాసార్లు నా మదిలో మెదిలింది. కానీ నన్ను నేను అబ్బాయిగా భావించుకుని ముందుకు సాగాను. బన్నీ స్లోప్స్ నుంచి రెడ్ రన్ వరకు పూర్తి చేసేందుకు పట్టిన సమయంలో నిజంగా ప్రత్యేకమైన అనుభూతి పొందాను. ఊహించలేనంత ఉల్లాసంగా ఉంది. నాకు శిక్షణ ఇచ్చిన ఎంసీ. కేట్‌కు ధన్యావాదాలు' అంటూ రాసుకొచ్చింది.

https://www.instagram.com/reel/CZOnncPBHW8/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CZOlEkqriXY/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed