సీక్రెట్‌గా సమంత- రాజ్ నిడిమోరు ఎంగేజ్‌మెంట్ .. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన రింగ్?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

సీక్రెట్‌గా సమంత- రాజ్ నిడిమోరు ఎంగేజ్‌మెంట్ .. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన రింగ్?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సినిమాల్లో నటించనప్పటికీ నిర్మాతగా మారి ‘శుభం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత నుంచి పలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్తోంది. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా సామ్, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో(Raj Nidimoru) డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే సమంత ఆయన భుజంపై పడుకుని ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఇక ఆ తర్వాత కూడా ఆయనతో వెకేషన్‌కు వెళ్లి చేతి పట్టుకుని ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

నిత్యం వీరి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు ఎన్ని వచ్చినప్పటికీ వీరిద్దరు మాత్రం స్పందించడం లేదు. నిత్యం పలు చోట్ల తిరుగుతూ కెమెరాల కంట పడుతున్నారు. ఇక ఇటీవల సమంత, రాజ్ నిడిమోరు ఒకే కారులో వెళ్తుండగా.. పలువురు వీడియోలు తీసి నెట్టింట షేర్ చేశారు. ఇక అది కాస్త నెట్టింట వైరల్ అవడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా గుసగుసలాడుకుంటున్నారు. ఈక్రమంలోనే.. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక అందులో ఒక ఫొటోలో ఆమె పెట్టుకున్న రింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎల్లో కలర్ స్టోన్‌తో ఉన్న ఆ రింగ్‌పై అందరి దృష్టి పడింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారా? అదే రింగ్ కావచ్చని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు మాత్రం రింగ్ పెట్టుకుంటే అలాంటి పుకార్లు సృష్టించడమేంటని మండిపడుతున్నారు.

Next Story