Samantha: సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్.. పెళ్లి కూడా చేసుకోబోతున్న లవ్ బర్డ్స్ .. అసలు విషయం రివీల్ చేస్తూ డైరెక్టర్ భార్య సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(samantha) అందరికీ సుపరిచితమే.ఈ అమ్మడు మయోసైటీస్ కారణంగా గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా అయింది.

Samantha: సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్.. పెళ్లి కూడా చేసుకోబోతున్న లవ్ బర్డ్స్ .. అసలు విషయం రివీల్ చేస్తూ డైరెక్టర్ భార్య సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(samantha) అందరికీ సుపరిచితమే.ఈ అమ్మడు మయోసైటీస్ కారణంగా గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా అయింది. మళ్లీ చాలా రోజుల తర్వాత ‘శుభం’(shubham) చిత్రంతో నిర్మాతగా మారింది. ఇక ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో సమంతకు మళ్లీ ఫుల్ పాపులారిటీ వచ్చి పడింది. ప్రస్తుతం సామ్ తెలుగులో ‘మా ఇంటి బంగారం’(maa inti bangaram) సినిమా చేస్తోంది. అలాగే హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’ సిరీస్‌లోనూ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే గత కొద్ది కాలంగా ఈ అమ్మడు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఆయన భుజంపై పడుకున్న ఫొటోను షేర్ చేయడంతో అది కాస్ల వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే రాజ్ నిడిమోరు భార్య శ్యామల కూడా వీరిద్దరి డేటింగ్‌పై ఇండైరెక్ట్ పోస్టులు పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సమంత తిరుపతి వెళ్లిన సమయంలోనూ ఆయనను తీసుకుని వెళ్లడంతో పుకార్లు పెరిగిపోయాయి. ఇక రాజ్ భార్య కూడా 2023 నుంచి ఆయనకు సంబంధించిన విషయాలను వెల్లడించకపోవడంతో విడాకులు అయిన తర్వాత నుంచే సామ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, శ్యామల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చింది. ‘‘నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఆమె రాజ్ గురించే పెట్టిందని అంటున్నారు. అలాగే రాజ్, సమంత త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు కావచ్చు అందుకే నమ్మకం గురించి ఒపెన్ అయిందని చర్చిస్తున్నారు.

Next Story