రాజ్ నిడుమోరుతో జర్నీ ప్రారంభమైందంటూ సమంత పోస్ట్‌ కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.

రాజ్ నిడుమోరుతో జర్నీ ప్రారంభమైందంటూ సమంత పోస్ట్‌ కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సామ్ కీలక పాత్రలోనూ కనిపించింది. మొత్తానికి తన బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమానే సమంతకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడ‌క్షన్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ (MaaIntiBangaram)రాబోతున్నట్లు ప్రకటన రాగా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో నిత్యం సమంత అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందా.. అప్డేట్స్ ఇస్తారా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండగా.. ఈ సినిమాను స‌గ‌ర్వంగా ప్రారంభించిన‌ట్లు సమంత అనౌన్స్ చేసింది.

‘‘ప్రేమ ఆశీర్వాదాలతో ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో మంచి ముహూర్తంతో మా జర్నీ ప్రారంభించాము. మేము ఏమి సృష్టిస్తున్నామో మీతో పంచుకోవడానికి మేము వేచి ఉండలేము. ఈ ప్రత్యేక చిత్రాన్ని ప్రారంభించేటప్పుడు మీ అందరి ప్రేమ, మద్దతు మాకు అవసరం’’ అని రాసుకొచ్చింది.ఇక ఈ విషయం తెలుసుకున్న వారు సమంతకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో స‌మంత‌, దిగంత్‌, గుల్షన్ దేవ‌య్య, సీనియ‌ర్ న‌టి గౌత‌మి, మంజుషా కీల‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి స‌మంత‌, రాజ్ నిడుమోరు(Raj Nidumoru), హిమాంక్ దువ్వూరు నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. ఓ బేబి వంటి బ్లాక్ బ‌స్టర్ త‌ర్వాత సమంత‌, నందినీ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story