- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన సమంత.. కారణం అదేనా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఖుషి’ సినిమా తర్వాత సినిమాలకు దూరం అయినప్పటికీ నిర్మాతగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఖుషి’ సినిమా తర్వాత సినిమాలకు దూరం అయినప్పటికీ నిర్మాతగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తన మొదటి చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో తన గృహప్రవేశానికి సంబంధించినవిగా తెలుస్తోంది. తన కొత్త ఇంట్లో రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో కలిసి ప్రత్యేక పూజలు చేసినట్లు అర్థమవుతోంది. తన ఇంటిని పువ్వులతో చాలా అందంగా ముస్తాబు చేసి ఆమె కూడా ట్రెడిషనల్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలుకు షేర్ చేయడంతో.. అది చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అలాగే ఆమె జిమ్ చేస్తున్న వీడియోలు, తన పెట్ డాగ్స్‌ను రాజ్ ముద్దు చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. కానీ అతని ముఖం కనిపించకుండా.. జాగ్రత్త పడిన సామ్ చేతులను మాత్రమే నెట్టింట పెట్టడం గమనార్హం. ఈ గృహప్రవేశం అక్టోబర్ 2న జరిగినప్పటికీ.. ఇప్పుడు షేర్ చేసింది. కాగా.. సమంత సినిమాల విషయానికొస్తే.. త్వరలో ఆమె ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
తన సొంత నిర్మాణ సంస్థలోనే రాబోతున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరు కలిసి విదేశాలకు వెకేషన్స్‌కు కూడా వెళ్తుండటంతో ఆ పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. ఇక ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ సమంత మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు.






