Samantha: సమంత కంటే అర్హ చాలా బెటర్ అంటున్న నెటిజెన్స్

by Disha Web Desk 10 |
Samantha: సమంత కంటే అర్హ చాలా  బెటర్ అంటున్న నెటిజెన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు విడుదలయింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ బాగా వినిపిస్తుంది. సమంత నటన , లుక్స్ విషయంలో నెటిజెన్స్ నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాత్రకు సమంత అస్సలు సూట్ కాలేదంటూ అభిప్రాయాలు వినిపించాయి. దేవ్ మోహన్ నటన బాగానే ఉన్నా ప్రేక్షకులకు తెలిసిన హీరో నటించి ఉంటె బావుండేదని అభిప్రాయపడ్డారు. ఇంకో వైపు అల్లు అర్హ డెబ్యూ సినిమా కావడంతో ఆమె నటనకు నెటిజన్లు సూపర్, గ్రేట్ అంటున్నారు. స్క్రీన్ పై అర్హ కనిపించేది కొద్దీ సమయం అయిన భరతుని పాత్రకు అర్హ ప్రాణం పోసింది. శాకుంతలం సినిమాలో సమంత కంటే అర్హ 100 రెట్లు బెటర్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

మహేశ్ బాబు, నయనతార కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీస్ ఏవో తెలుసా?

Next Story