- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత అదిరిపోయే ప్లాన్..లిటిల్ హర్ట్స్ కుర్రాళ్లతో కొత్త సినిమా ?
సమంత కూడా చూసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే సాయి మార్తాండ్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పారట.

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. అదే 'లిటిల్ హార్ట్స్ ( LittleHearts ). గత నెలలో రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. మౌళి, శివానీ నాగారం, జై కృష్ణ లాంటి చిన్న నటీనటులతో సినిమా తీశాడు దర్శకుడు సాయి మార్తాండ్. కథ జనాలకు ఎక్కడంతో బంపర్ హిట్ అయింది. ఇక ఈటీవీ విన్ లో దసరా కానుకగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి స్ట్రీమింగ్ కూడా అవుతోంది. ఈ మూవీ ఓటీటీలో కూడా అరుదైన రికార్డులు కొల్లగొడుతోంది. మొబైల్ ఓపెన్ చేసినా, రీల్స్ చూసినా ఈ సినిమాకు సంబంధించినవే వస్తున్నాయి. అంతలా ఈ సినిమా పాపులర్ అయింది.
ముఖ్యంగా హీరో మౌళి, జై కృష్ణ ( Actor Jai Krishna) కామెడీ మాత్రం సినిమాలో అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను హీరోయిన్ సమంత కూడా చూసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే సాయి మార్తాండ్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పారట. ఇదే కాంబినేషన్ లో మంచి కథ రాయండి.. తాను నిర్మాతగా వ్యవహరిస్తానని సమంత బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనికి దర్శకుడు సాయి మార్తాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకవేళ ఈ కాంబినేషన్ సినిమా ఓకే అయితే, నిర్మాతగా సమంత మంచి సక్సెస్ కావడం గ్యారెంటీ అంటున్నారు.






