డిప్రెషన్‌తో సమంత డ్రగ్స్ తీసుకుందంటూ.. సంచలనం సృష్టిస్తున్న పోస్ట్

by Hamsa |
డిప్రెషన్‌తో సమంత డ్రగ్స్ తీసుకుందంటూ.. సంచలనం సృష్టిస్తున్న పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే సిటాడెల్ షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల షూటింగ్స్ అయిపోయాయి ఆరు నెలలు క్యారవాన్‌లోనే గడిచిపోయిందంటూ ఓ పోస్ట్ కూడా చేసింది. అయితే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు స్టార్ హీరో, హీరోయిన్స్‌పై పలు పోస్టులు చేస్తూ దూమారం రేపుతుంటాడు.

తాజాగా, సమంతపై ఉమైర్ ఓ సంచలన ట్వీట్ చేశాడు. ‘‘ సమంత డ్రగ్స్ తీసుకున్న తర్వాత తన వ్యానిటీ వ్యాన్ నుండి బయటకు వచ్చింది. సమంత ఫేస్ చూడండి, ఆమె ఫుల్ డ్రగ్స్ అవతార్‌లో ఉంది. ఆమెకు కూడా తెలివి లేదు. ఆమె ఇప్పుడు చాలా డిప్రెషన్‌లో ఉంది’’ అంటూ రాసుకొచ్చాడు అంతేకాకుండా సామ్‌కు సంబంధించిన ఓ వీడియోను కూడా జత చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed