సినిమాలకు దూరమైనా భారీగానే సంపాదిస్తున్న సమంత

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-26 15:13:18  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

సినిమాలకు దూరమైనా భారీగానే సంపాదిస్తున్న సమంత
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు తెగ ఎంజాయ్ చేస్తోంది సామ్. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇదంతా పక్కపపెడితే తాజా సమాచారం చేతిలో పనిలేకపోయినా ఆమె బాగానే సంపాదిస్తోందట. కొన్ని బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇలా యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story