Samantha: లక్షల మందిని మోసం చేస్తున్న సమంత.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సిరియాక్ పోస్ట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-04 07:08:10  IST  )

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(Samantha)కు మయోసైటీస్ రావడంతో గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

Samantha: లక్షల మందిని మోసం చేస్తున్న సమంత.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సిరియాక్ పోస్ట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(Samantha)కు మయోసైటీస్ రావడంతో గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ద్వారా పలు విషయాలు చెప్తుంది. అలాగే నిర్మాతగానూ మారి ‘శుభం’ (shubham) చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే ఈ సినిమా మే 9న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ రాణిస్తోంది. అయితే సమంత సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. అయితే ఆమె ఇటీవల పెట్టిన పోస్ట్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు సమాచారం అందిస్తుందంటూ ఓ డాక్టర్ సంచలన పోస్ట్ పెట్టడంతో అది కాస్త హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆమె దేని గురించి పోస్ట్ పెట్టిందనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..

సమంత (నికోటినామైడ్ మోనోన్యూక్లియోటైడ్’ సప్లిమెంట్లను ప్రమోట్ చేయడంపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె చెప్పేవన్నీ అబద్దాలేనని ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ఈప్రొడక్ట్స్ వాడితే శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని ఆమె చెప్పింది. సమంత ఓ సైన్స్ తెలియని నటి. ఆ కంపెనీ మోసపూరితమైనది. నాడ్ అనేది శరీర జీవక్రియకు ముఖ్యమైన కోఎంజైమ్. అయితే nmnఅనేది నాడ్ స్థాయిలను పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రచారంలో ఉన్న ఒక సప్లిమెంట్.

చాలామంది nmnను వృద్ధాప్యాన్ని తగ్గించే అద్భుత ఔషధంగా మార్కెట్ చేస్తున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. దీనివల్ల శరీరం శోషణకు గురవుతుంది. అవయవాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. అని పెట్టాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. కొన్ని లక్షలమంది ఫాలోవర్స్‌ను మోసం చేస్తుదని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫ్రాడ్ సప్లిమెంట్లను ప్రచారం చేస్తున్నందుకు తిట్టిపోస్తున్నారు.

Also Read:నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. నీ పిచ్చిని చూడానికి ఎదురుచూస్తున్నానంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషెష్


Next Story