'Hit-3' లో సమంత..! అడివి శేష్ రియాక్షన్ ఇదే

by Disha Web Desk 6 |
Hit-3 లో సమంత..! అడివి శేష్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్-2. దీనికి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంత్ తిపిర్నేని నిర్మించారు. భారీ అంచనాలతో డిసెంబర్ 2న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులల్లో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను మొత్తం ఎనిమిది భాగాలుగా తీసుకురానున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. తాజాగా, ఓ నెటిజన్ 'సమంత లాంటి యాక్టర్‌ని, ఫ్యూచర్ హిట్ సిరీస్‌లో మెయిన్ లీడ్‌లో తీసుకుంటే ఇంకా బాగుంటుందని' ట్వీట్ చేశాడు. దీనికి అడవి శేష్ స్పందిస్తూ 'అది ఒక అద్భుతమైన ఆలోచన. మరి నువ్వు ఏమంటావు సామ్' అని సమంతను ట్యాగ్ చేశాడు. దానికి సమంత ''ఓ రౌడీ పోలీసు.. ఆలోచన బాగుంది. ముందుగా హిట్ -2 తో సూపర్ హిట్ అందుకున్నందుకు అభినందనలు అడివిశేష్'' అంటూ రీట్వీట్ చేసింది.



Read More.......

రెండో వారం కూడా కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న "Masooda "

Next Story

Most Viewed