సమంత సిగ్గు వదిలేసి ఆ పని చేస్తే, టాలీవుడ్‌లో టాప్ రేంజ్ పక్కానంట!

by Disha Web Desk 8 |
సమంత సిగ్గు వదిలేసి ఆ పని చేస్తే, టాలీవుడ్‌లో టాప్ రేంజ్ పక్కానంట!
X

దిశ, సినిమా : ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత.మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరసగా స్టార్ హీరోల సరసన నటించి, నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో సమంత యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ప్రతీది పంచుకుంటుంది. అంతే కాకుండా సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా విడిపోయిన తర్వాత ఈ అమ్మడుకు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. అది ఏమిటంటే?

నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సామ్‌పై చాలా నెగిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె గురించి నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో సామ్ మానసికంగా కూడా చాలా బాధలు ఎదుర్కొంది. అంతే కాకుండా వాటన్నింటి నుంచి బయటపడటానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో సమంతకు మునుపు ఉన్నంత క్రేజ్ లేదు. అయితే సామ్‌ గత వైభవం మళ్లీ అందుకోవాలంటే పరోక్షకంగా అక్కినేని ఫ్యామిలీ పై మండిపడడం తగ్గించుకొని సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయాలంట. అంతే కాకుండా సిగ్గు‌గా భావించకుండా కొన్ని యాక్షన్, బోల్డ్ సీన్స్ కానీ బోల్డ్ రోల్స్ లో కనిపిస్తే జనాలు మళ్ళీ ఆమెను లైక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు నెటిజన్స్.

Read More..

షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఆ కారణంతో సినిమా ఇండస్ట్రీకి దూరం కానుందా!

Next Story