విజయ్ వల్ల సమంతకు మరో తలనొప్పి స్టార్ట్.. కర్మ రివర్స్ అయిందంటూ నెటిజన్స్ ట్రోల్స్

by Disha Web Desk 6 |
విజయ్ వల్ల సమంతకు మరో తలనొప్పి స్టార్ట్.. కర్మ రివర్స్ అయిందంటూ నెటిజన్స్ ట్రోల్స్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్ భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, ‘ఖుషి’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘ఆరాధ్య సాంగ్’ రిలీజ్ అయింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం గతంలో సామ్ చేసిన ట్వీట్.

2014లో మహేష్ బాబు నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌పై సామ్ ఒకప్పుడు ఓ ట్వీట్ షేర్ చేసింది. ‘‘ ఇంకా రిలీజ్ అవ్వని ఓ మూవీ పోస్టర్ చూశాను. అది చూడంగానే నా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి’’ అంటూ రాసుకొచ్చింది. అందులో మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుండగా.. ఆయన వెనకే హీరోయిన్ మోకాలి మీద పాకుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఖుషి సెకండ్ సింగిల్‌లో కూడా విజయ్, సమంత చేతిపై కాలు పెట్టి కనిపించాడు. దీంతో ఆ పోస్టర్‌ను ఖుషి పోస్టర్‌ను పక్క పక్కన పెట్టి కొంత మంది నెటిజన్లు కర్మ రివర్స్ అయిందంటూ సామ్‌ను తిట్టిపోస్తున్నారు. మరి కొంత మంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Next Story

Most Viewed