Samantha: అతడితో రిలేషన్‌షిప్ కన్మర్మ్ చేసిన సమంత.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-03 02:14:42  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తెలుగు హీరోలందరితో నటించి కొద్ది కాలం ఇండస్ట్రీని షేక్ చేసింది.

Samantha: అతడితో రిలేషన్‌షిప్ కన్మర్మ్ చేసిన సమంత.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తెలుగు హీరోలందరితో నటించి కొద్ది కాలం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుని మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మయోసైటీస్ రావడంతో పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఇక అప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటూ ఓ పాడ్ కాస్ట్ ద్వారా పలు విషయాలు వెల్లడిస్తోంది. ఇటీవల కాస్త కోలుకోవడంతో సమంత నిర్మాతగా సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఓ పాత్రలోనూ నటించింది. ఈ చిత్రంతో అమ్మడు మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ పర్సనల్ లైఫ్‌తో సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది కాలంగా ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.

ఈక్రమంలోనే సామ్ అతనితో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేయడంతో రిలేషన్‌షిప్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. సమంత, రాజ్ ఇద్దరు కలిసి ఇంట్లోనూ కలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నో సార్లు సమంత ఆయనతో ఉన్న ఫోటోలు షేర్ చేసి అందరికీ బిగ్ షాకిచ్చింది. ఇక వీరి బంధంపై ఎన్నో వార్తలు వచ్చాయి. అలాగే ఇంతకుముందే పెళ్లైన రాజ్‌తో సమంత ఉండటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతోంది. దీంతో ఆయన భార్య కూడా వీరి రిలేషన్ గురించి ఇండైరెక్ట్‌గా పలు పోస్టులు పెట్టి హింట్ ఇచ్చింది.

అయితే ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ సమంత మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సైలెంట్‌గా రాజ్‌తో ఎంజాయ్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మరోసారి తన రిలేషన్‌షిప్ గురించి హింట్ ఇచ్చింది. రాజ్‌తో కలిపి దుబాయ్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌కు వెళ్లింది. అతని చేతిలో చేయి వేసి ఉండగా.. ఎయిర్‌పొర్టులో షాపింగ్ కూడా చేసి కొంత టైమ్ స్పెండ్ చేశారు. అయితే ఆయన ముఖం కనిపించనప్పటికీ సమంతతో ఉన్నది రాజ్ అని అంతా అంటున్నారు. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు సమంత, రాజ్‌తో ఉన్న రిలేషన్‌పై ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు.

Next Story