సమంత బిగ్ ప్లాన్... హ్యాట్రిక్ కు ముహూర్తం ఫిక్స్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-07-21 04:41:57  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ( Samantha) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దాదాపు 15 సంవత్సరాలుగా

సమంత బిగ్ ప్లాన్... హ్యాట్రిక్ కు ముహూర్తం ఫిక్స్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ( Samantha) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు సమంత. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సమంత... ఇప్పటికీ కూడా అదే ఊపును కొనసాగిస్తున్నారు.

పెళ్లయి.. విడాకులు అయినా సరే... హీరోయిన్ సమంతకు క్రేజ్ పెరగడమే తప్ప ఇక్కడ తగ్గలేదు. హీరోయిన్ గా, వ్యాపారవేత్తగా, ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల శుభమ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు సమంత. తన సొంత నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో.. కీలక పాత్రలో కూడా సమంత కనిపించారు.

అయితే ఇప్పుడు తన సొంత నిర్మాణంలోనే మరో సినిమా చేసేందుకు హీరోయిన్ సమంత రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. అది కూడా సక్సెస్ఫుల్ దర్శకులు నందినితో ( Nandini) సినిమాకు ప్లానింగ్ చేస్తున్నారట సమంత. ఆమెతో జబర్‌దస్త్, ఓ బేబీ సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలు కూడా మంచి రిజల్ట్ తీసుకువచ్చాయి. అందుకే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి... సమంత, నందిని సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం అండుతోంది.

Next Story