- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరలో దర్శనమిచ్చిన సమంత.. ఆ పార్ట్‌పై ఉన్న టాటూ కనిపించడంతో అంతా షాక్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరం అయిన ఆమె మయోసైటీస్ వ్యాధితో కొద్ది రోజులు బాధపడింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరం అయిన ఆమె మయోసైటీస్ వ్యాధితో కొద్ది రోజులు బాధపడింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. కొద్ది కాలంపాటు ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆమె వ్యాధి కాస్త దగ్గడంతో మళ్లీ ఓ ప్యాడ్‌కాస్ట్ మొదలెట్టింది. అలాగే ఇటీవల నిర్మాతగా మారింది. ఇటీవల ‘శుభం’(shubham) చిత్రాన్ని నిర్మించిన ఈ అమ్మడు ఇందులో ఓ కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న చీరకట్టుకో కనిపించింది.
బ్లాక్ అండ్ వైట్ పిక్స్ షేర్ చేసిన ఆమె పియానో వాయిస్తూ ఫొటోకు పోజులిచ్చింది. అంతేకాకుండా స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన సామ్ తన వీపుపై ఉన్న లవ్ టాటూ చూపించింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఆ టాటూ ఎవరి కోసం వేసుకుందా? అని అయోమయంలో పడిపోయారు. కాగా, సమంత గత కొద్ది కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయనతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఇక అప్పటినుంచి సమంత, రాజ్‌కు సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయినప్పటికీ వీటిపై ఆమె స్పందించడం లేదు. వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.






