- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత.. కొత్త అధ్యాయం మొదలైందంటూ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సినిమాలకంటే తన పర్సనల్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సినిమాలకంటే తన పర్సనల్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది కాలంగా ఆమెకు సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత పేరు మార్మోగిపోతోంది. ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. అయినప్పటికీ సామ్ మాత్రం ఆయనతో చాలా క్లోజ్‌గా ఉంటూ తన రిలేషన్‌షిప్‌పై హింట్ ఇచ్చే ప్రయత్నాలే చేస్తుంది. కానీ ఒక్కసారి కూడా అధికారికంగా ప్రకటించలేదు.. కాకపోతే రాజ్‌తో సన్నిహితంగా ఉండే ఫొటోలను షేర్ చేయడంతో పాటు వెకేషన్స్‌కు కూడా వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
ఇక ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సమంత ఫ్రొఫెషనల్ లైఫ్‌లోనూ బిజీ అయిపోయింది. తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం-2గా ‘మా ఇంటి బంగారం’చిత్రాన్ని తీసుకురాబోతుంది. ఇటీవల దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్న సమంత క్లాతింగ్ బిజినెస్‌తో పాటు ఫెర్ఫ్యూమ్ బిజినెస్‌లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. వరుస ప్రకటనతో అభిమానులను సంతోష పెడుతుంది.
తాజాగా, సమంత ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. ‘ట్రూలీ స్మా’ అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘కొత్త అధ్యాయం మొదలైంది. సౌకర్యంగా ఉండే బట్టలు ధరించండి. నిశ్శబ్ద విశ్వాసాన్ని గౌరవించండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సామ్ అభిమానులు, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమె ఇందులోనూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






