పవన్ రిజెక్ట్.. స‌ల్మాన్ ఖాన్ తో వంశీ భారీ బ‌డ్జెట్ మూవీ..?

by velandi.Saikiran |

పవన్ రిజెక్ట్.. స‌ల్మాన్ ఖాన్ తో వంశీ భారీ బ‌డ్జెట్ మూవీ..?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో వంశీ పైడిపల్లి ఒకరు. వంశీ పైడిపల్లి సినిమాల్లో మంచి సబ్జెక్టు ఉంటుంది. సమాజ సేవ, కొంతమేర యాక్షన్ సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఆయన అరడజన్ సినిమాలు చేయగా అందులో కొన్ని హిట్టుగా మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి.

2023లో వారసుడు సినిమాతో మంచి కలెక్షన్స్ రాబడిన వంశీ పైడిపల్లి... ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ తో కొత్త సినిమా చేయబోతున్నాడట. అది దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నారట. కానీ ఆయన షెడ్యూల్ సెట్ కాకపోవడంతో సల్మాన్ ఖాన్ దగ్గరకు కథ తీసుకువచ్చారట. దీనికి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ సినిమాకు లైన్ క్లియర్ అయిందని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Next Story