ప్రభాస్ ‘స్పిరిట్’తో సల్మాన్ ఖాన్ ఢీ? బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫైట్ ఖాయం

by Mallepaka Hamsa |

ముందుచూపుతో ఆలోచించి ఈద్ తేదీని ముందే ప్రకటించాము. మిగతా విషయాలను సరైన సమయం వచ్చినప్పుడు చెబుతాము. కొంచెం ఓపిక పట్టండి..

ప్రభాస్ ‘స్పిరిట్’తో సల్మాన్ ఖాన్ ఢీ? బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫైట్ ఖాయం
X

దిశ, సినిమా: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, అప్పుడే చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ మొదటి రోజుకు సంబంధించిన ఒక చిన్న బిహైండ్ ద సీన్స్ వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ వీడియోలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లిలను సల్మాన్ ఎంతో ఆత్మీయంగా పలకరించడం కనిపిస్తుంది. ఈ ప్రకటన చేస్తూ సల్మాన్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టారు. "ముందుచూపుతో ఆలోచించి ఈద్ తేదీని ముందే ప్రకటించాము. మిగతా విషయాలను సరైన సమయం వచ్చినప్పుడు చెబుతాము. కొంచెం ఓపిక పట్టండి.. నేను ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నానో, మీ పరిస్థితి కూడా అదేనని నాకు తెలుసు" అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.

సల్మాన్ ఖాన్ సినిమా ఈద్ 2027 రేసులో ఉండగా, అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన సెన్సేషనల్ మూవీ ‘స్పిరిట్’తో రాబోతున్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు కొద్దిరోజుల వ్యవధిలోనే వస్తే, బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, సల్మాన్ ఖాన్‌ల మధ్య భారీ పోటీ తప్పదు. కాగా.. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ముంబైలో ఒక నెల రోజుల లాంగ్ షెడ్యూల్‌లో నిమగ్నమై ఉంది. ఇక్కడ ప్రధాన సన్నివేశాలతో పాటు కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో నయనతార కూడా పాల్గొంటున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ తర్వాత నయనతార చేస్తున్న మరో పెద్ద బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సల్మాన్-నయనతారల కాంబో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Next Story