- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
25 ఏళ్లుగా ఆ పనికి దూరంగా ఉన్నానంటూ సల్మాన్ ఖాన్ సంచలనం..
ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ (Salman Khan)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ (Salman Khan)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోలు షూటింగ్‌ల మధ్యలో లేదా వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం కామన్. కానీ సల్మాన్ మాత్రం గత 25 ఏళ్లుగా రెస్టారెంట్‌కి వెళ్లి డిన్నర్ చేయలేదని చెప్పడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తాను ఎక్కువగా ఇంట్లోనే తింటానని, బయటకు వెళ్లి తినే అలవాటు ఎప్పుడో మానేశానని స్పష్టం చేశాడు. ఈ మాటలు విన్న ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది హీరోలు బయట తినడం తగ్గించి, పర్సనల్ చెఫ్స్‌తో ఇంట్లోనే ప్రత్యేకంగా వంటలు చేయించుకుంటున్నారు. అయినా సరే, అప్పుడప్పుడు షూట్ బ్రేక్ దొరికితే మాత్రం డైట్ పక్కన పెట్టి ఫేవరెట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తుంటారు. కానీ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ మాత్రం సంవత్సరాలుగా అదే డిసిప్లిన్‌ను ఫాలో అవుతూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
బయట ఆహారానికి దూరంగా ఉండటం, ఇంట్లోనే సింపుల్ ఫుడ్ తినడం వల్లే తన ఆరోగ్యం నిలబెట్టుకోగలుగుతున్నానని చెబుతున్నాడు. ‘‘నేనెప్పుడూ కుటుంబం, ఫ్రెండ్స్ అంటూ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను. నా జీవితంలో నేను కొందరు క్లోజ్ ఫ్రెండ్స్‌ను కోల్పోయాను. ఇప్పుడు నలుగురైదుగురు మాత్రమే నాతో ఉన్నారు. వాళ్లు నన్ను ఎన్నో ఏళ్ల నుంచి చూస్తు్న్నారు. అయినప్పటికీ నేను డిన్నర్‌కి వెళ్లి 25 ఏళ్లు అవుతుంది. షూటింగ్స్, ఎయిర్‌పోర్ట్, హోటల్, ఈవెంట్స్ అంటూ ఫుల్ బిజీగా ఉన్నా. ఇదే నా పనిగా మారిపోయింది. అయినా నేను బాధపడటం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు.
వారి కోసం నేను బయటకు వెళ్లకుండా ఎంతైనా కష్టపడతాను’’ అని అన్నారు. కాగా.. సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan)మూవీ చేస్తున్నారు. ఇది 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భారత్-చైనా సైనిక ఘర్షణ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం భారత సైనికుల ధైర్యాన్ని, త్యాగాన్ని కీర్తిస్తూ అపూర్వ లఖియా దర్శకత్వంలో రాబోతుంది. ఇందులో సల్మాన్ ఖాన్ సైనికుడిగా కనిపించనుండగా.. ఆయన సరసన చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య వయ్యే ఏడాది విడుదల కాబోతుంది.






