- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీస్ కలెక్షన్లపై సల్మాన్ అసంతృప్తి.. వందకోట్లు లెక్కే కాదంటూ
by Bhoopathi Nagaiah |
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

X
దిశ, సినిమా: ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇటీవల వస్తున్న సినిమాలన్నీ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో సక్సెస్ కాలేకపోతున్నాయని అన్నాడు. ‘ఈ రోజుల్లో రూ.100 కోట్లు వసూల్ చేయడమంటే చాలా తక్కువ. పంజాబీ, మరాఠీ, హిందీలోనూ కొన్ని సినిమాలు రూ.400 నుంచి రూ.600 కోట్లు రాబడుతున్నాయి. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు మళ్లీ చూడాలనుకుంటున్నారు. అందుకే వంద కోట్లు అనేది పెద్ద విషయం కాదు. ప్రతి సినిమాకు వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ఉండాలని భావిస్తున్నా’ అని తెలిపాడు. చివర్లో ఈ అంచనాలు తన సినిమాలకు మాత్రం పనిచేయట్లేదంటూ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
Next Story






